Type Here to Get Search Results !

Visa-free countries వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావచ్చు

వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావచ్చు

ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడానికి వీసా తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లాలన్నా వీసా అవసరం. అందుకే విదేశాలకు ప్రయాణించాలనుకునే వారు వీసా తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని దేశాలు మాత్రం పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు వీసాలు లేకపోయినా ఆయా దేశాల సందర్శనకు అనుమతిస్తాయి. భారతీయులను అనుమతించే వీసారహిత దేశాలు ఇవే..

కుక్ దీవులు, ఫిజీ, మైక్రోనేషియా, నియు, వనాటు, ఒమన్, ఖతార్, బార్బడోస్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, మోంట్సెరాట్, కిట్స్ అండ్ నెవిస్, విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, భూటాన్, కజకిస్తాన్, మకావో (SAR చైనా), నేపాల్, రక్షకుడు, మారిషస్, సెనెగల్, ట్యునీషియా..ఈ దేశాలను వీసా లేకుండనే భారతీయులు సందర్శించవచ్చు.

ఈ దేశాలతోపాటు నవంబర్ 2023 నుంచి థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలకు కూడా వీసా లేకుండానే భారతీయ పౌరులు ప్రయాణించడానికి అనుమతి ఇచ్చాయి. థాయ్‌లాండ్‌కు ఏప్రిల్ 2024 వరకు, శ్రీలంకకు మార్చి 2024 వరకు సందర్శనకు అవకాశం కల్పించాయి. తాజాగా ఈ జాబితాలో మలేషియా కూడా చేరింది. అయితే వీసా లేకుండా ప్రయాణించే సదుపాయం ఎప్పటి వరకు ఉంటుందో ఆ దేశం స్పష్టం చేయలేదు.

వీసా ఉచితం అయినప్పటికీ, విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ప్రయాణికులు తప్పనిసరిగా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలి. పాస్‌పోర్ట్ చెల్లుబాటు కాల పరిమితి, తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు, రిటర్న్ ఫ్లైట్ టికెట్, వసతి నిర్ధారన, గత 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌.. వంటి వివరాలు సంబంధిత అధికారులకు చూపవల్సి ఉంటుంది.

ఈ వీసా రహిత దేశాలకు చేరుకున్న తర్వాత, కస్టమ్స్ అధికారులు పాస్‌పోర్ట్ లేదా గుర్తింపును తనిఖీ చేసి, మీకు ఎంట్రీ స్టాంప్‌ను అందజేయాలి. భారతీయ పౌరులు ఈ దేశాలకు వెళ్లేందుకు ఎలాంటి వీసా అవసరం లేదనే విషయం తెలుసుకున్నారుగా.. ఇకపై సెలవులకు ఈ వీసా ఫ్రీ దేశాలకు వెళ్లడానికి ప్లాన్‌ చేసుకోండి.

All the Above content is taken from : Tv9Telugu.com
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area