ట్రైన్‌లో ఈ వస్తువులు తీసుకెళ్తున్నారా..? జైలు శిక్ష తప్పదు.. తస్మాత్ జాగ్రత్త
train మిగితా అన్ని మార్గాలతో పోల్చితే రైలులో ప్రయాణం చేయడం సేఫ్ అనేది చాలా మంది భావన. నిత్యం వందలాది ట్రైన్స్ ద్వారా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. లగేజ్ మొదలుకొని ప్రయాణికులను వారి వారి గమ్యస్థానానికి చేరవేయడంలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోంది.
పేద, మధ్యతరగతి, ధనిక అన్ని వర్గాలకు రైలు ప్రయాణం అందుబాటులో ఉంటోంది. మరోవైపు రైల్వే శాఖ కూడా ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఎప్పటికప్పుడు పలు సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.
అయితే రైలులో ప్రయాణించే సమయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. టికెట్ తీసుకొని జర్నీ చేయడం మొదలుకొని ప్రయాణికుల సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని పలు సూచనలు చేస్తోంది రైల్వే శాఖ. ఒకవేళ ప్రయాణికుల వీటిని ధిక్కరిస్తే జైలుకు వెళ్లే అవకాశం ఉంది.
సేఫ్టీ మీజర్స్ లో భాగంగా భారతీయ రైల్వేలు కఠినమైన లగేజీ నియమాలను పెట్టింది. ప్రయాణికుల భద్రతనే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తూ లగేజీ నియమాలు ఉల్లంఘించిన వారికి జైలులో పెడుతోంది రైల్వే శాఖ. మరి ఆ నియమాలు ఏంటి? అనేది చూద్దామా..
నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు కాబట్టి.. రైల్వే శాఖ పెట్టిన కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. రైల్వే తీసుకున్న నిర్ణయాత్మక చర్యల్లో లగేజీ రూల్స్ ప్రధానమైనవి. రైళ్లలో కొన్ని నిర్దిష్ట వస్తువులను తీసుకెళ్లకుండా రైల్వే శాఖ కఠినమైన హెచ్చరిక జారీ చేసింది.
ప్రయాణికులు తమ వెంట పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, డీజిల్, కిరోసిన్, ఆయిల్, స్టవ్‌లు, అగ్గిపెట్టెలు, సిగరెట్ లైటర్లు, బాణసంచా లాంటి మండే పదార్థాలను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం అని రైల్వే శాఖ చెబుతోంది. ఈ మేరకు అవగాహన కోసం బోగీల్లో పోస్టర్ కూడా డిస్ప్లే చేస్తోంది.
పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, డీజిల్, కిరోసిన్.. వీటితో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ రైలులో అగ్ని ప్రమాదం చోరు చేసుకుంటే లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయాణ సమయంలో ఈ అగ్ని ప్రమాద కారకాలను నిషేదించింది రైల్వే శాఖ.
.అయితే రైల్వే శాఖ పెట్టిన ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ నిషేధిత వస్తువులను తీసుకువెళుతున్న వారికి జైలు శిక్షతో పాటు జరిమానాగా పడే అవకాశం ఉంది. కాబట్టి అందరి సురక్షితమైన ప్రయాణం కోసం అందరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
All the Above content is taken from : telugu.news18.com