Operation Ajay A340 Technical fault of the flight..
Machilipatnam NewsOctober 17, 20230
operation ajay
ఆపరేషన్ అజయ్ కింద న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్ (Tel Aviv) వెళ్లిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దానిని సరిచేసేందుకు జోర్డాన్‌కు విమానాన్ని తరలించారు. హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను వెనక్కి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం అక్టోబర్ 12న 'ఆపరేషన్ అజయ్' పేరుతో విమానాలను నడుపుతోంది. స్పైస్ జెట్‌కు చెందిన A340 విమానం ఈ ఆపరేషన్‌లో పాల్గొంటోంది.