TDP MLAS SUSPENDED |
AP Assembly: అసెంబ్లీ సమావేశాల తొలిరోజు చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని పట్టుబడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేయడంతో స్పీకర్ 15మందిని సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలను సెషన్ అంతా సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల సమస్యలు, ప్రతిసవాళ్లపై గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ప్రారంభమైన తొలిరోజే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసాలు తిప్పారని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు.చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని పట్టుబడుతూచేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. చర్చ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైనప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేల తీరును ఖండిస్తూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు కోటంరెడ్డి, సత్యప్రసాద్, పయ్యావుల కేశవ సహా 14 మంది ఎమ్మెల్యేల ఈ సెషన్ వరకు సస్పెండ్ చేశారు.